కలుపు నివారణ, అంతరక్రుషి :

విత్తన రెండు వారాల లోపుగా ఒత్తు మొక్కలను తీసివేయాలి. విత్తనం మరియు నారు నాటతనికి ముందు ప్లుక్లోరాలిన్ 45% లేదా పెండిమిధాలిన్ ౩౦% ఎకరాకు లీటరు చొ.న.  200 లీ . నీటిలో కలిపి పిచికారి చేసి కలుపును నివారిచవచ్చు. నాటిన  25, 30 రోజులకు  వెడల్పు కలుపు మొక్కల నిర్మూలనకు ఎకరాకు 400 గ్రా. 2,4 డి సోడియం సాల్ట్ 80% పోదిముందు 200 లీ. నీటి లో కలిపి పిచికారి చేయాలి.